అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు.పువ్వాడ అజయ్ సమర్పించిన అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయిని ఆరోపించారు.
ఈ క్రమంలో పువ్వాడ నామినేషన్ తిరస్కరించాలని తుమ్మల ఫిర్యాదులో పేర్కొన్నారు.కాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల బరిలో ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.







