ఉల్లి పంటను( Onion Crop ) ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.ఉల్లి పంటను సాగు చేసే నేలను ఎలా తయారు వేసుకోవాలి.
విత్తన శుద్ధి( Seed Purification ) ఎలా చేయాలి ఎలాంటి నేలలు ఉల్లి పంటకు అనుకూలంగా ఉంటాయి అనే విషయాలను తెలుసుకుందాం.ఉల్లి పంట సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి.
ఉప్పు, చౌడు, క్షారత్వం అధికంగా ఉండే నేలలు ఉల్లి సాగుకు పనికిరావు.నేల యొక్క పీహెచ్ విలువ 5.8 నుంచి 6.5 వరకు ఉండే నేలలలో అధిక దిగుబడి సాధించవచ్చు.
ఉల్లి సాగును( Onion Cultivation ) చేపట్టే నేలను ముందుగా దమ్ము చేసుకోవాలి.ఒక ఎకరాకు 25 టన్నుల నాడెప్ కంపోస్ట్ ఎరువు, 200 కిలోల ఘనజీవామృతం ను ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
ఆఖరి దుక్కి అనంతరం నేలను చిన్నచిన్న మడులుగా విభజించాలి.నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి.బోదేలు లేదా మడులు నీటిపారుదల వసతిని బట్టి కట్టుకోవాలి.

ఒక కిలో కు నాలుగు కిలోల తెగులు నిరోధక నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.రెండు లీటర్ల ఆవు మూత్రం,( Cow Urine ) ఒక కిలో పశువుల పేడ,( Cow Dung ) ఒక కిలో పుట్ట మట్టి, 150 గ్రాముల ఇంగువ లను 100 లీ.నీటిలో కలిపి ఒక ద్రావణంలో తయారు చేయాలి.ఉల్లిగడ్డలను లేదా ఉల్లిగడ్డ నారును ఆ ద్రావణంలో ఓ 20 నిమిషాల పాటు ముంచి

ఆ తర్వాత ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల తైరంతో విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత పొలంలో విత్తుకోవాలి.పొలంలో మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే ఎలాంటి ఉష్ణోగ్రతను అయినా పంట తట్టుకోగలుగుతుంది.ఉష్ణోగ్రత 15 నుండి 21 డిగ్రీల మధ్య ఉంటే ఉల్లిగడ్డ పంట పెరుగుదల ఆరోగ్యకరంగా ఉంటుంది.పంట సాగులో ఈ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.







