వైరల్ అవుతున్న మాస్ట్రో 'స్నేక్ పీక్' వీడియో !

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా కీలక పాత్రలో నటిస్తున్నా విషయం విదితమే.

బాలీవుడ్ లో టబు నటించిన పాత్రలో తమన్నా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

క్రైం త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ అంధుడి పాత్రలో కనిపించ బోతున్నాడు.ఒక మర్డర్ కేసును నితిన్ ఎలా డీల్ చేస్తాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

Advertisement

ఈ సినిమా త్వరలోనే ఓటిటీ సంస్థ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి స్నేక్ పీక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ వీడియోలో నితిన్ పియానో వాయిస్తూ కనిపిస్తున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.బాలీవుడ్ లో సూపర్ హిట్ అవ్వడం వల్ల ఆ సినిమాకు రీమేక్ గా చేస్తున్న మాస్ట్రో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే ప్రేక్షకులు భావిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 10 న ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు.ఈ సినిమాను జనాలకు దగ్గర చేయాలనీ తరచు అప్డేట్ లు ఇస్తున్నారు.

Advertisement
https://youtu.be/uOz_YrbmGh4

తాజా వార్తలు