వర్షా కాలం వచ్చిందంటే గ్రామాల్లో ఇళ్లల్లోకి పాములు వచ్చేస్తుంటాయి.ముందుగా కప్పలు వస్తాయి.
వాటిని తినేందుకు పాములు వస్తుంటాయి.ఇక చలి కాలంలో అయితే ఏకంగా షూలు, చెప్పులతో పాములు( Snakes ) మకాం వేస్తాయి.
వెచ్చదనాన్ని అవి ఆస్వాదిస్తుంటాయి.ఇక గ్రామాల్లో ఎక్కువ మంది కోళ్లను పెంచుకుంటుంటారు.
కొందరు నాటు కోళ్లను పందేలు పెంచుకుంటుంటే, మరికొందరు గుడ్లను పొదిగేందుకు, గుడ్ల కోంస పెంచుతారు.ఆ గుడ్లను తినేందుకు కూడా పాములు వస్తుంటాయి.
చాలా సందర్భాల్లో పాములు 5 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లను మింగిన వీడియోలు చూసి ఉంటాం.తర్వాత వాటిని బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో పాములు కక్కేస్తుంటాయి.

అప్పటి వరకు అవి ఉక్కరిబిక్కిరి అవుతుంటాయి.ఇలా తమ స్థాయికి మించి గుడ్లను మింగే పాములు( Snake Swllowed Egg ) మనం చూసి ఉంటాయి.అయితే ఓ చిన్న పాము తన తల కంటే పెద్దదైన గుడ్డును అమాంతంగా మింగేసింది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.పాములలో అనేక జాతులు ఉన్నాయి.వాటిలో విషపూరితమైనవి ఉంటాయి.
అంతేకాకుండా విష రహితమైనవి కూడా ఉంటాయి.విషపూరితమైన పాములలో క్రాల్ కూడా ఒకటి.
ఇది ఒక్క కాటుతో పెద్ద మనిషిని అయినా చంపగలదు.దీని విషం అంతగా ప్రభావం చూపిస్తుంది.
ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తుంటాయి.కొన్ని సార్లు వాటిని చూసినప్పుడు అంతా ఆశ్చర్యపోతుంటారు.

ఇదే కోవలో ఓ చిన్న పాము తన తల కంటే చాలా పెద్దది అయిన గుడ్డును మింగింది.పాము ముందు గుడ్డు పెడితే దాని తల కంటే గుడ్డు చాలా పెద్ద సైజులో ఉంది.అలాంటి గుడ్డును చూసి పాము ఏ మాత్రం భయపడలేదు.ఒక్కసారిగా గుడ్డును మింగేసింది.ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ ( Twitter )లో ఓ యూజర్ షేర్ చేయగా వైరల్ అవుతోంది.సెప్టెంబర్ 13న షేర్ చేసిన ఈ వీడియోకు 3 లక్షల 57 వేలకు పైగా వ్యూస్ దక్కాయి.6 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.వెయ్యి మందికి పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు.
ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు.







