అలాంటప్పుడు భర్త వేరే మహిళతో ఉన్నా తప్పులేదు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..

తాజాగా ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) ఇచ్చిన ఒక తీర్పు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ఢిల్లీ హైకోర్టు ఒక కేసును విచారిస్తూ భర్త మరొక మహిళతో సహజీవనం చేసినంత మాత్రాన అతను విడాకులు ఇచ్చే హక్కును కోల్పోలేడని వ్యాఖ్యానించింది.భార్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.2005 నుంచి విడివిడిగా జీవిస్తున్న దంపతులకు మళ్లీ కలిసే అవకాశం ఇవ్వబోమంటూ ఫ్యామిలీ కోర్టు( Family Court ) విడాకులు ఇచ్చిన తీర్పుతో ఢిల్లీ కోర్టు ఏకీభవించింది.భార్య తనపై, అతని కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టడం, వారితో నిత్యం గొడవలు పెట్టడం ద్వారా భర్త జీవితాన్ని నరకంగా మార్చిందని కోర్టు పేర్కొంది.

 Delhi High Court Husband Living With Another Woman After Long Years Of Separatio-TeluguStop.com
Telugu Delhi, Divorce-Latest News - Telugu

భార్య వల్ల కలిగే ఈ సమస్యలు స్పష్టంగా క్రూరమైనవని, వాటిని పరిష్కరించే మార్గం లేదని కోర్టు అభిప్రాయపడింది.భార్య నుంచి విడాకులు( Divorce ) తీసుకోకుండా భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడా లేదా అనేది మాట్లాడుకోకపోవడమే మంచిదన్నట్లు పేర్కొంది.ఎందుకంటే చాలా కాలం పాటు విడిపోయి తిరిగి కలుసుకునే ఆశ లేనప్పుడు భర్త వేరొక మహిళతో సహజీవనం ప్రారంభించాడని, ఇది అంగీకరించదగినదేనని ధర్మాసనం చెప్పుకొచ్చింది.

భర్త మానసిక వేదనకు గురై భార్యతో దాంపత్య సంబంధాన్ని కొనసాగించలేకపోయాడని గమనించింది.

Telugu Delhi, Divorce-Latest News - Telugu

విడిపోయిన తర్వాత మరో మహిళతో కలిసి జీవించాలని భర్త తీసుకున్న నిర్ణయం తదనంతర సంఘటన అని, విడాకుల హక్కుపై ఎలాంటి ప్రభావం చూపలేదని కోర్టు సదరు భార్యకు వివరించింది.విడాకులు తీసుకోలేనంత తప్పు అతడు చేసినట్లు తీర్పు ఇవ్వడానికి కారణాలేం లేవన్నట్లు ఢిల్లీ కోర్టు వ్యాఖ్యలు చేసింది.భార్య భర్త పట్ల క్రూరంగా ప్రవర్తించిందని కింది కోర్టు చెప్పడం సరైనదేనని, ఆమె అప్పీలును తోసిపుచ్చింది.

ఈ కేసులో కింది/ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని అంగీకరించని భార్య.భర్త తనపై దారుణంగా అబద్ధాలు చెబుతున్నాడని తెలిపింది.

మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని కూడా చెప్పింది.అయితే భర్త రెండో వివాహానికి( Husband Second Marriage ) సంబంధించి ఎలాంటి ఆధారాలు, సమాచారం లేవని కోర్టు పేర్కొంది.

భార్య భర్త పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు రుజువైతే, భర్త కోరే విడాకులు నిరాకరించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తించిందని రుజువైనంత కాలం, భర్త మరొక స్త్రీతో సహజీవనం చేసినప్పటికీ విడాకులు మంజూరు చేయవచ్చని ఈ కేసు చెప్పకనే చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube