సెట్ లో అబార్షన్ అయితే అబద్ధాలు చెబుతున్నాను అన్నారు: స్మృతి ఇరానీ

Smriti Irani Says She Is Lying If There Is An Abortion On The Set ,Smriti Irani , Smriti Irani Abortion,Shobha Kapoor ,Ekta Kapoor Banner , Keonki Saas Bhi Kabhi Bahu Thi Serial

బిజెపి నేత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈమె చాలా మందికి కేవలం రాజకీయ నాయకురాలిగా మాత్రమే తెలుసు కానీ ఆమె రాజకీయాలలోకి రాకముందు నటి అనే విషయం చాలామందికి తెలియదు.

 Smriti Irani Says She Is Lying If There Is An Abortion On The Set ,smriti Irani-TeluguStop.com

స్మృతి ఇరానీ( Smriti Irani ) రాజకీయాలలోకి రాకముందు పలు బుల్లితెర సీరియల్స్ లో నటిగా నటిస్తూ సందడి చేశారు.ఇలా బుల్లితెరపై నటిస్తూ సందడి చేస్తున్నటువంటి ఈమె అనంతరం రాజకీయాలలోకి అడుగుపెట్టి నేడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.

ఇకపోతే తాజాగా స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తను జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Telugu Ekta Kapoor, Keonkisaas, Shobha Kapoor, Smriti Irani-Movie

ఈమె రాజకీయాలలోకి రాకముందు పలు సీరియల్స్ లో నటించారు.ఇందులో క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్( Keonki saas bhi kabhi bahu thi serial ) తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిందని తెలియజేశారు.దీనిని శోభాకపూర్, ఏక్తాకపూర్ బ్యానర్ పై నిర్మించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అనే విషయం తనకు ఏ మాత్రం తెలియదని అయితే ఒక రోజు షూటింగ్ లొకేషన్లో చాలా నీరసంగా ఉండడంతో తాను ఇంటికి వెళ్తానని చెప్పారు.అయితే ఆ రోజు వర్క్ చాలా ఉండటం వల్ల తనకు ఇంటికి వెళ్లడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఈమె వెల్లడించారు.

Telugu Ekta Kapoor, Keonkisaas, Shobha Kapoor, Smriti Irani-Movie

ఇక షూటింగ్ లొకేషన్లో ఎక్కువసేపు పనిచేస్తూ ఉండటం వల్ల తనకు తీవ్రమైన రక్తస్రావం జరిగిందని అయితే సాయంత్రం హాస్పిటల్ కి వెళ్ళగా తనకు అబార్షన్ ( Abortion )అయ్యిందనే విషయాన్ని వెల్లడించినట్లు స్మృతి ఇరానీ గుర్తు చేసుకున్నారు.ఆ విషయం తెలిసి తాను ఎంతో కృంగబాటకు గురయ్యానని తెలిపారు.ఇక ఈ విషయం షూటింగ్ లొకేషన్లో తెలుపగా ఒక వ్యక్తి తనకు ఎలాంటి అబార్షన్ జరగలేదని కేవలం అబద్ధాలు చెబుతున్నారు అంటూ వదంతులు పుట్టించారు.ఆ సమయంలో తాను రిపోర్ట్స్ తీసుకెళ్లి ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తాకపూర్ కు చూపించాను.ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా సంపాదన రూ.1800 అని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube