విశ్వనాయకుడు కమల్ హాసన్ ( Kamal Haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమాను కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు.
కమల్ హాసన్ నుండి నెక్స్ట్ రాబోతున్న సినిమా ”ఇండియన్ 2”( Indian 2 ).ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ మళ్ళీ మొదలైన ఈ సినిమాపై కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి బజ్ నెలకొంది.
ఎందుకంటే ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కిస్తున్నాడు.ఎప్పుడో రెండేళ్ల క్రితమే వాయిదా పడిన ఈ సినిమా విక్రమ్ సినిమాతో కమల్ హిట్ అందుకున్న తర్వాత మళ్ళీ రీ స్టార్ట్ అయ్యింది.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో రాజకీయాలపై కమల్ హాసన్ చెప్పే డైలాగ్స్ బాగా బోల్డ్ గా ఉంటాయని.ముఖ్యంగా సౌత్ రాజకీయ నాయకులపై ఈయన వ్యక్తిగతంగా కూడా డైలాగ్స్ చెప్పారని.ఈ డైలాగ్స్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని వివాదాలకు దారి తీస్తాయో అని ఇప్పటి నుండే చర్చ జరుగుతుంది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కమల్ నటన హైలెట్ గా నిలుస్తుందని.
ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఎనభై ఏళ్ల లుక్ లో కమల్ నటన అత్యద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు.
కాగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే షూట్ దాదాపు చివరి దశకు చేరుకుంది.అయితే ఈ సినిమాకు మొత్తం 3 గంటల నిడివి రావడంతో శంకర్ ఈ సినిమా నిడివిని తగ్గించే పనిలో ఉన్నారట.
చూడాలి కమల్ నటన, డైలాగ్స్ ఆద్యంతం అలరించే విధంగా శంకర్ తెరకెక్కిస్తున్నాడో లేదో.