స్మార్ట్‌ఫోన్ లేనిదే ఇప్పుడు ఏ పని సులభంగా జరగడం లేదనే చెప్పాలి.అప్పట్లో కేవలం కాల్స్ మాట్లాడడానికే ఫోన్ ఉపయోగించేవారు.
కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్లు కాల్స్ సహా లెక్కలేనన్ని పనులు చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి.అయితే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పేదవారు కొనుక్కునేందుకు అందుబాటులో ఉండటం లేదు.
కొత్త కంపెనీలు నాలుగైదు వేల రేంజ్‌లో మొబైల్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.కానీ వాటిలో అందించే ఫీచర్లు ఆకర్షణీయంగా ఉండడం లేదు.
అందుకే వాటి వల్ల ఉపయోగం లేదని పేదవారు చిన్న ఫోన్లతోనే అడ్జస్ట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో పేద వారు కూడా కొనుగోలు చేసేలా తక్కువ ధరలకే మొబైల్ ఫోన్ తీసుకొచ్చాయి.ఆ ఫోన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.శాంసంగ్ గెలాక్సీ ఎం 01 కోర్
మీడియాటెక్ ప్రాసెసర్ తో 1జీబీ ర్యామ్ + 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చే శాంసంగ్ గెలాక్సీ ఎం 01 కోర్ బేస్ మోడల్ ధర రూ.5 వేల నుంచి స్టార్ట్ అవుతుంది.ఇందులో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5.3 ఇంచుల HD+ డిస్ ప్లే వంటి ఫీచర్లున్నాయి.స్టెప్-అప్ వేరియంట్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజీతో వస్తుంది.ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ.5,999 గా ఉంది.శాంసంగ్ ఎం 01 కోర్ (Samsung M01 core) 1జీబీ ర్యామ్ + 16జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.4999 ధరకే ఫ్లిప్ కార్టులో లభిస్తోంది.అయితే బేస్ వేరియంట్ ధర అమెజాన్, తదితర ఈ కామర్స్ సైట్స్ లో రూ.5199 నుంచి ప్రారంభమవుతుంది.
2.రెడ్ మీ గో

రెడ్ మీ గో (Redmi Go) 1జీబీ ర్యామ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఐదు ఇంచుల డిస్ ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది.దీని ధర రూ.5999 మంచి ప్రారంభం అవుతుంది.
3.మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్

మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్ (micromax bharat 2 plus) రూ.3599 ధరకు అందుబాటులో ఉంది.ఇందులో 1 జీబీ ర్యామ్+8 జీబీ స్టోరేజ్, 4 అంగుళాల డిస్ ప్లే, 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.ఇది 1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
ఇంకా ఐటెల్ 25 ప్రో, జియోనీ ఎఫ్8 నియో, లావా జెడ్ 1, ఐకాల్ కే201, కార్బన్ ఎక్స్21, నోకియా 1 లాంటి బ్రాండెడ్ ఫోన్ లు అన్నీ కూడా రూ.4000- రూ.6000 ధరలలో అందుబాటులో ఉన్నాయి.