తాజాగా ఐటెల్ బ్రాండ్ నుంచి ఐటెల్ ఏ49 అనే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది.దీని ధర కేవలం రూ.6,499కే కాగా ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందించారు.బ్యాక్ సైడ్ రెండు ఏఐ-పవర్డ్ 5 మెగాపిక్సెల్ కెమెరాలతో సహా ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.అలాగే ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో వచ్చే ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ పై పనిచేస్తుంది.
ఐటెల్ ఏ49 క్రిస్టల్ పర్పుల్, డోమ్ బ్లూ, స్కై సియాన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది.క్వాడ్‌కోర్ 1.4గిగాహెర్జ్ ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుందని ఐటెల్ కంపెనీ వెల్లడించింది.అయితే ఇందులో మీడియా టెక్ వాడారా లేదా వేరే చిప్ సెట్ వాడేరా అనేది తెలియాల్సి ఉంది.ఐటెల్ ఏ49 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ అయింది.
అమెజాన్‌లో మరికొద్ది రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌కు వచ్చే అవకాశం ఉంది.ఐటెల్ ఇండియా వెబ్‌సైట్‌లోనూ కొనుగోలుదారులు కొనుగోలు చేయొచ్చు.
ఇంటర్నల్ స్టోరేజ్‌ను మీరు ఎక్స్పాండ్ చేసుకునేందుకు వీలుగా మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఇందులో అందించారు.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించగా దానికి ఏఐ బ్యూటీ మోడ్ లాంటి సరికొత్త ఫీచర్లతో యాడ్ చేశారు.
ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.







