సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరం అవుతూ ఉంటారు.అలా వారు నటించిన ఒకటి రెండు పాత్రలే వారికి మంచి గుర్తింపును తెచ్చి పెడుతూ ఉంటాయి.
అంతే కాకుండా ఆ ఒకటి రెండు పాత్రలతో ప్రేక్షకులకు బాగా చేరువ అవుతూ ఉంటారు.ఇంకొందరు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అలా తక్కువ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్నేహమురళి కూడా ఒకరు.
స్నేహ మురళి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ శివ మనసులో శక్తి( Siva manasula sakthi ) సినిమాలో హీరో జీవా సోదరిగా నటించిన స్నేహ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈమె సినిమాలలో నటించికపోయినప్పటికీ తమిళ మీమ్స్ లో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది.నటించింది ఒక్క సినిమానే అయినా ఆమెకు బోలెడంత పాపులారిటీ వచ్చింది.2009లో వచ్చిన శివ మనసులో శక్తి ఆమె తొలి చిత్రం.ఇది ఇలా ఉంటే స్నేహ మురళి దాదాపు 14 ఏళ్ల తర్వాత గుడ్‌న్యూస్ చెప్పింది నటి.త్వరలో స్నేహ ఐడీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది.ఇకపోతే స్నేహ మరో శుభవార్త కూడా చెప్పింది.తను తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది.
గత ఏడాది స్నేహ సిద్ధార్థ్ అనే వ్యక్తిని ( Siddharth )పెళ్లిచేసుకుంది.ఆమె అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం నిత్యం టచ్‌లో ఉంది స్నేహ.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజెన్స్ ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.