సీతారామం సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఉత్తరాది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మరోసారి తన యొక్క సత్తా ను తెలుగు లో చాటేందుకు సిద్ధం అయ్యింది.సీతారామం సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నాని హీరోగా రూపొందబోతున్న సినిమా లో హీరోయిన్ గా నటించేందుకు కమిట్ అయ్యింది.
నాని కి జోడీగా మృణాల్ ఠాకూర్ హిట్ కాంబో అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.ఈ సమయంలో మరో యంగ్ స్టార్ హీరో సినిమాకు మృణాల్ ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడీగా మృణాల్ నటించబోతుంది.సీతారామం సినిమా లో దుల్కర్ సల్మాన్ తో నటించి మెప్పించిన మృణాల్ ఈసారి మొదట నానితో ఆ తర్వాత మెగా హీరోతో నటించేందుకు సిద్ధం అయ్యింది.పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకున్న మృణాల్ కు ముందు ముందు తెలుగు లో మరిన్ని ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.
మహేష్ బాబు సినిమా లో కూడా ఈమె నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఇప్పటికప్పుడు కాకున్నా కూడా కనీసం పదేళ్ల సినీ కెరీర్ ను ఈమె కొనసాగించి.ఎంతో మంది స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి.
ఇలా వచ్చి అలా పోయే హీరోయిన్ ఈమె కాదని.కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉన్న హీరోయిన్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నాని హీరోయిన్ అంటూ మృణాల్ గురించి ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో మెగా హీరోతో సినిమా ను చేయడం ద్వారా ఈమెకు మరింతగా పాపులారిటీ సొంతం అవ్వబోతుంది.
కోటికి పైగా రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న మృణాల్ ఠాకూర్ ఈ రెండు హిట్ అయితే రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు.