తండ్రికి తగ్గ తనయ... కోటి రూపాయలు రెమ్యూనరేషన్ చారిటీకి డొనేట్ చేసిన సితార?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక మహేష్ బాబు గారాల పట్టి సితార ( Sitara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Sitara Daughter Of Her Father Has Donated Crores Of Rupees ,sitara, Tollywood,-TeluguStop.com

సితార ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఈమె పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ క్రమంలోనే సితార పిఎంజె జువెలరీ ( PMJ Jewellery )సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అయితే తాజాగా సితార జ్యువెలరీ సంస్థను ప్రారంభించారు.

Telugu Mahesh Babu, Namrata, Pmj Jewellery, Sitara, Tollywood-Movie

ఇలా ఈ యాడ్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ జువెలరీ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి సితార అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ క్రమంలోని మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెప్పారు.

ఈ యాడ్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.అయితే మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏం చేశారు అంటు మీడియా ప్రతినిధులు సితారని ప్రశ్నించారు.

అయితే సితార ఆన్సర్ విన్నటువంటి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Telugu Mahesh Babu, Namrata, Pmj Jewellery, Sitara, Tollywood-Movie

తన ఫస్ట్ యాడ్ కోసం సితార అందుకున్నటువంటి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తన అవసరాలకు ఉపయోగించుకోకుండా ఈమె ఆ డబ్బునంతటిని చారిటీ కోసం ఇచ్చానని తెలియజేశారు.ఈ విధంగా సితార కోటి రూపాయలు చారిటీకి ఇచ్చారనే విషయం తెలియడంతో సితార ఎంతో గొప్ప మనసు చాటుకున్నారని ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మరి కొంతమంది సహాయం చేయడంలో తండ్రికి తగ్గ తనయ అంటూ సితార గురించి ఎంతో గొప్పగా కామెంట్లు చేస్తూ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube