తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అతి చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీ పిల్లల్లో సితార ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు.
ఈ చిట్టి పాపకు సోషల్ మీడియాలో హీరోయిన్స్ లో అభిమానులు ఉన్నారు.చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది.
మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యాడ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇకపోతే ఇటీవల కాలంలో సితారకు సంబంధించిన ఏదో ఒక విషయం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది.మరి ముఖ్యంగా సితార తరచూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.అలా చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.
తండ్రి మహేష్ బాబు బాటలోనే నడుస్తూ కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది సితార.చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ప్రతి పండక్కి పద్దతిగా తెలుగింటి కుందనపు బొమ్మలా రెడీ అయి పూజలు చేసి, ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసింది.
తన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి సితార ముగ్గులు వేసింది.సితార ముగ్గులు వేస్తున్న ఫోటోలని, తాను వేసిన ముగ్గుని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.అలాగే గాగ్రా చోళీ డ్రెస్ లో దీపం పట్టుకొని దీపావళికి స్పెషల్ ఫోటోలు కూడా ముందే పోస్ట్ చేసింది సితార.
ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కోట్లకు వారసురాలు అయ్యి ఉండి కూడా ఎంతో సింప్లిసిటీగా ఉండడానికి సితార ఇష్టపడుతూ ఉంటుంది.