తెలంగాణలో రాజకీయాల్లో కల్లోలం సృష్టించిన ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఇందులో భాగంగా విచారణకు హాజరుకాని జగ్గు స్వామిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
తుషార్, రామచంద్ర భారతిలకు జగ్గు స్వామి మధ్యవర్తిగా ఉన్నట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.అదేవిధంగా బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిని సైబరాబాద్ పోలీసులు వాంటెడ్ జాబితాలో చేర్చారు.
ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను తెలంగాణ పోలీసులు అలెర్ట్ చేశారు.