ఎట్టకేలకు 100 కోట్ల మార్క్ చేరుకున్న 'సార్'.. ఈ విజయంలో కీ రోల్ మనదే!

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సార్’.ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది.

 Sir Movie Crossed A Massive 100 Crores Gross Worldwide, Dhanush, Sir Movie, Koll-TeluguStop.com

ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.ముందు నుండి మంచి అంచనాలు క్రియేట్ చేసుకుని థియేటర్స్ లో రిలీజ్ కాగా ప్రేక్షకుల చేత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

సినిమా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.వెంకీ అట్లూరి ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించాడు.తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అయినా ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.

ఈ సినిమాలో సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ళ భరణి, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కడంతో పాజిటివ్ టాక్ వచ్చింది.మంచి కలెక్షన్స్ రావడంతో నిన్నటితో ఈ సినిమా 100 కోట్ల మార్క్ టచ్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా పోస్టర్ తో తెలిపారు.అంతేకాదు 100 కోట్లు సాధించడంతో ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ధనుష్ ఫ్యాన్స్ కు అలానే తెలుగు, తమిళ్ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ ఈ పోస్టర్ ను వదిలారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా 100 కోట్లు సాధించడానికి కీ రోల్ మన తెలుగు రాష్ట్రాలు పోషించినట్టు తెలుస్తుంది.ఎందుకంటే తమిళ్ వర్షన్ కంటే తెలుగు వర్షన్ లోనే ఎక్కువ రెస్పాన్స్ లభిస్తుంది దీంతో తెలుగు సార్ కు వాథి కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది.

దీంతో ఈ సినిమా విజయంలో మన తెలుగు ఆడియెన్స్ కీ రోల్ పోషించారు.చూడాలి ఈ సినిమా ఇంకా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు రాబడుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube