టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించి ఉన్నటువంటి సింగర్ సునీత (Singer Sunitha) తనయుడు ఆకాష్ (Akash) ఇటీవల హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈయన సర్కారు నౌకరి (Sarkaru Naukari) అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
గంగన మోని శేఖర్ దర్శకత్వంలో రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా జనవరి ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం.
ఇక ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ సునీత ఇటీవల థియేటర్లో ఈ సినిమాని చూశారు.ఈ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఎమోషనల్ కామెంట్ చేశారు.
నిజం చెప్పాలి అంటే తాను ఈ సినిమాని ఎడిట్ చేసేటప్పుడే చూశానని ఇప్పుడు మరోసారి థియేటర్లో చూస్తున్నానని వెల్లడించారు.ఇప్పుడు మరోసారి ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అని తెలిపారు.
![Telugu Akash, Akashsarkaru, Sarkaru Naukari, Sunitha, Tollywood-Movie Telugu Akash, Akashsarkaru, Sarkaru Naukari, Sunitha, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/singer-sunitha-emotional-after-watching-his-son-akash-sarkaru-naukari-film-detailsd.jpg)
ఒక హీరోగా సినిమాని ముందుకు నడిపించడం అంటే చాలా పెద్ద బాధ్యత చిన్నప్పటినుంచి ఆకాష్ హీరో అవుతాను అంటే ఏమో అనుకున్నాను కానీ సినిమాలంటే మరి ఇంత పిచ్చి ఉందని నాకు తెలియదు అంటూ ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా ఈమె కన్నీళ్లు పెట్టుకుంటూ సినిమా ఎమోషనల్ గా ఉందని నేను కన్నీళ్లు పెట్టుకోవడం లేదు నా పిల్లలు కన్న కలలు నెరవేరుతుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
![Telugu Akash, Akashsarkaru, Sarkaru Naukari, Sunitha, Tollywood-Movie Telugu Akash, Akashsarkaru, Sarkaru Naukari, Sunitha, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/singer-sunitha-emotional-after-watching-his-son-akash-sarkaru-naukari-film-detailsa.jpg)
నాకు కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ పలికించే నటులు అంటే చాలా ఇష్టమని ఈ సినిమాలో ఆకాష్ నాకు కనిపించలేదు.గోపాల్ అనే పాత్ర( Gopal Role ) మాత్రమే నాకు కనిపించిందని తెలియజేశారు.కొన్ని సినిమాలు మన హృదయాలను హత్తుకుంటాయి అలాంటి సినిమాలను మనం థియేటర్లోనే చూడాల్సి ఉంటుందంటూ ఈ సందర్భంగా సునీత సర్కారు నౌకరి సినిమా గురించి తన కొడుకు నటన గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.