శుభవార్త చెప్పిన సింగర్ సునీత.. బ్లెస్సెడ్ అంటూ పోస్ట్.. నెట్టింట్లో వైరల్!

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో మధురమైన పాటలు పాడిన సునీతకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక సునీత గత కొన్ని సంవత్సరాల నుంచి తన జీవితంలో ఒంటరిగా గడుపుతూ, గత ఏడాది రెండవ వివాహం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈమె రెండవ వివాహం తర్వాత చాలామంది ఈమెను దారుణంగా ట్రోల్ చేశారు.

అయితే వాటి గురించి పట్టించుకోకుండా సునీత తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.రెండవ వివాహం తర్వాత సునీత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక ఈ మధ్య కాలంలో సునీత వ్యవసాయ పనులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ తనకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం అనే విషయాన్ని కూడా వెల్లడించారు.

Advertisement

ఇదిలావుండగా తాజాగా సునీత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.పచ్చి మామిడి పండ్లతో కలిసి ఫోటోలు దిగిన ఈమె ఈ ఫోటోని షేర్ చేస్తూ బ్లెస్సెడ్ అంటూ రాసుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడంతో సునీత తల్లి కాబోతుందా.

అందుకే పచ్చి మామిడి పండ్లను చూపెడుతున్నారా.అందుకే బ్లెస్సెడ్ అంటూ ఈ ఫోటో షేర్ చేశారా అని ఎంతోమంది సందేహాలను వ్యక్తం చేస్తూ ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మొత్తానికి సునీత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు