టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ గీత మాధురి ( Geetha Madhuri ) ఒకరు ఈమె సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే గీత మాధురి నటుడు నందుని( Nandhu ) ప్రేమించి పెద్దల సమక్షంలో 2014వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇకపోతే వీరిద్దరికి 2019వ సంవత్సరంలో చిన్నారి జన్మించారు.ఈ చిన్నారికి దాక్షాయిని ప్రాకృతి అనే నామకరణం చేశారు.

ఇలా తన కూతురికి సంబంధించిన విషయాలను గీతామాధురి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.ఇక ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా ఈమె మరోసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.ఫిబ్రవరి నెలలో తన చిన్నారి దాక్షాయిని అక్కగా మారబోతుంది అంటూ ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి అసలు విషయం వెల్లడించారు.

ఇకపోతే తాజాగా గీతామాధురి తన కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతపు వేడుకలను( Baby Shower ) జరుపుకున్నారు.తాజాగా ఈ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.చాలా సాంప్రదాయ బద్ధంగా ఈ వేడుకలు జరిగాయని తెలుస్తుంది.అందంగా డెకరేషన్ చేయడమే కాకుండా నారింజ ఆకుపచ్చ చీర కట్టుకొని గీతామాధురి కూడా ఎంతో అందంగా కనిపించారు.
ఇలా ఈమె సీమంతపు ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరి కొద్ది రోజులలో గీత మాధురి మరో బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది.






