తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల (Suma Kanakala) ఒకరు.ఈమె యాంకర్ గా కొన్ని దశాబ్దాలుగా ఈమె యాంకర్ గా కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే చిన్న హీరో నుంచి మొదలుకొని స్టార్ హీరో సినిమా వేడుక జరుగుతుంది అంటే ఆ వేడుకలు తప్పనిసరిగా సుమ కనకాల ఉండాల్సిందే.ఈమె లేకుండా ఏ సినిమా ఈవెంట్స్ కూడా జరగవు.
ఇక సుమ తన భర్త రాజీవ్ కనకాల(Rajeev Kanakala) ఇద్దరు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా సుమా కుమారుడు రోషన్ కనకాల( Roshan Kanakala ) కూడా ఇటీవల బబుల్ గమ్ (Bubble Gum) సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇలా హీరోగా తన మొదటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అని పెంచుకున్నారు.
రోషన్ కూడా తన ఫస్ట్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ (Sohel) హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు( Bootcut Balaraju ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమా కుమారుడు రోషన్ కూడా హాజరై సందడి చేశారు.అయితే ఈ వేదికపై సుమా పట్ల తన కుమారుడు చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమానికి సుమ ప్యాంట్ వేసుకొని కాస్త ట్రెండీ వేర్ లో వచ్చారు.

దీంతో రోషన్ ఇక్కడ మా అమ్మ ఉండాలి మీరేమైనా చూశారా అంటూ మాట్లాడారు.అమ్మా నువ్వేనా గుర్తు పట్టలేదు.ప్యాంట్ నీ గెటప్ భలే ఉంది అంటూ సెటైర్లు వేశాడు.
ఈ గెటప్ లో నిన్ను చూసేసరికి గుర్తుపట్టలేకపోయాను అంటూ సెటైర్స్ వేయడంతో వెంటనే సుమ నా డ్రెస్ మీద మీ నాన్న సెటైర్ వేరు నువ్వేంటి రా ఇంటికి రా నీ సంగతి చెబుతా అంటూ సుమ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.







