హత్య కేసులో భారతీయుడికి జీవిత ఖైదు విధిస్తూ సింగపూర్ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది.సూరజ్ శ్రీకాన్ దివాకర్ మణి త్రిపాఠి అనే భారత సంతతి యువకుడు హత్య కేసులో నేరాన్ని అంగీకరించాడు.
మే 10, 2020న జాగింగ్ సమయంలో 38 ఏళ్ల టే రుయ్ హావోను సూరజ్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఛానెల్ న్యూస్ ఆసియా నివేదించింది.బాధితుడు, నిందితుడు ఇద్దరూ పుంగోల్‌లోనే నివసించేవారు.
కానీ ఒకరికొకరికి పరిచయం లేదు.కోవిడ్ కారణంగా సర్క్యూట్ బ్రేకర్ ప్రారంభమైనప్పటి నుంచి టే వారానికి రెండు మూడు సార్లు జాగింగ్ చేయడం ప్రారంభించాడు.
సూరజ్ శ్రీకాన్ రన్నింగ్ చేయడానికి ఇష్టపడేవాడు.
మే 10వ తేదీ సూరజ్ శ్రీకాన్‌కు ముఖ్యమైనదని కోర్టు విన్నది.
ఆ రోజున అతని తండ్రి వారి కుటుంబాన్ని విడిచిపెట్టడంతో పాటు అతను జాతీయ సేవలో చేరిన రోజు.ఆరోజంటే అతనికి నిరాశ, కోపం.2020 మే 10వ తేదీన సూరజ్ శ్రీకాన్ తన ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు… సింగపూర్ సాయుధ దళాలు ఇచ్చిన స్విస్ ఫోల్డింగ్ కత్తిని వెంట తెచ్చుకున్నాడు.ఎప్పటిలాగే సూరజ్ శ్రీకాన్ రన్నింగ్ చేస్తుండగా.
ప్రమాదవశాత్తూ బస్టాప్ సమీపంలో పడిపోయాడు.తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఐదు నుంచి పది నిమిషాల పాటు దాని చుట్టూ తిరిగాడు.
సరిగ్గా అదే సమయంలో టే జాగింగ్ చేస్తూ తనను అధిగమించడాన్ని సహించలేకపోయిన శ్రీకాన్ కత్తి బయటకు తీసి టేని వెంబడించాడు.ఆపై టే వెనుక భాగంలో పొడిచాడు.
టే కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు సూరజ్‌శ్రీకాన్ మరోసారి చేయి, పొత్తికడుపు ప్రాంతంలో పొడిచాడు.

దీంతో టే 995కి కాల్ చేయగా.పారామెడిక్స్ అతనిని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ సూరజ్ శ్రీకాన్‌ను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.
వైద్యులు అతనిని పరిశీలించగా.సూరజ్ తీవ్రమైన సామాజిక ఆందోళన, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు తేలింది.
అతను జీవితంలో ఎదుర్కొన్న సమస్యల కారణంగా మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు విపరీతమైన కోపానికి దారి తీశాయని వైద్యులు తెలిపారు.సూరజ్ శ్రీకాన్‌పై గతంలో ఎలాంటి క్రైమ్ హిస్టరీ లేదని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.







