చంద్రముఖి సీక్వెల్ లో ఆ పాత్ర కోసం వెటరన్ స్టార్ హీరోయిన్

రజినీకాంత్ హీరోగా జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా మాతృక మలయాళంలో మొదటిగా తెరకెక్కింది.

 Simran Lead Role In Chandramukhi Sequel, Lawrence, Tollywood, Kollywood, South C-TeluguStop.com

అక్కడ చంద్రముఖి పాత్రలో శోభన నటించింది.తరువాత అది కన్నడంలో రాజ్ కుమార్, సౌందర్య ప్రధాన పాత్రలలో వచ్చింది.అదే సినిమా తమిళంలో రజినీకాంత్ హీరోగా వచ్చింది.ఇక తెలుగులో కూడా ఈ సినిమా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా తెలుగులో వెంకటేష్ హీరోగా పి వాసు దర్శకత్వంలో నాగవల్లి టైటిల్ తో సినిమా వచ్చింది.అయితే అది డిజాస్టర్ అయ్యింది.

ఇప్పుడు మళ్ళీ పి వాసు దర్శకత్వంలోనే తమిళంలో లారెన్స్ మెయిన్ రోల్ చంద్రముఖి 2 తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా మొదటి సినిమాకి కొనసాగింపుగానే ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఇందులో జ్యోతిక పోషించిన పాత్రలో సిమాన్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ని రూల్ చేసిన ఈ అమ్మడు మరల రీఎంట్రీ ఇచ్చింది.

ఈ నేపధ్యంలో చంద్రముఖి పాత్ర కోసం సిమ్రాన్ ని దర్శకుడు ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.మరి జ్యోతిక స్థాయిలో ఆ పాత్రలో సిమ్రాన్ ఆకట్టుకుంటుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube