ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన సింహాద్రి అప్పన్న, శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి చందనోత్సవాల ఏర్పాట్లను భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసారు.ఈ సందర్భంగా సామాన్య భక్తులకు, విఐపి లకు, వివిఐపిలకు, ఏర్పాటు చేసిన దర్శన క్యూలైన్ లను పరిశీలించారు.
చందన ఉత్సవం కు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు , మజ్జిగ లాంటివి , మెడికల్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, లాంటివి అందుబాటులో ఉంచాలని, నిత్యం శానిటేషన్ చేయిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ఎండా కాలం దృష్టి లో ఉంచుకొని అగ్నిమాపక సిబ్బంది ని కూడా ఉంచాలని అధికారులకు సూచించారు.చందనోత్సవం కి సుమారుగా లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కనుక భక్తులు సదుపాయాలు విషయంలో అదికారులతో పాటు కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు తీసుకుని ఘనంగా ఉత్సవాలు నిర్వహంచేలా చూడాలని ఎమ్మెల్యే అవంతి కోరారు.
ఈ పర్యవేక్షణలో లో ఆర్డివో బాస్కర్ రావు , ఈవో చంద్రకళ , జోనల్ కమిషనర్ వెంకట రమణ , ఇండోన్మేంట్ అదికారులు , సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు….