అమెరికాలో 'లక్కరెడ్డి హనిమిరెడ్డికి'అత్యున్నతన పురస్కారం...!!!!

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో సిలికానాంధ్రా కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.రికార్డులు నెలకొల్పడంలో సిలికానాంధ్రా కి పోటీ ఎవరూ లేరనే చెప్పాలి.

ప్రముఖ ప్రవాస వైద్యులు డాక్టర్ .లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇప్పటి వరకూ సుమారు 50 కోట్లకి పైగా విరాళాలు అందించిన కారణంగా ఘనంగా సత్కరించుకుంది.లక్కి రెడ్డి చేసే సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా లెక్కకి మించి ఉన్నాయని సభ్యులు కొనియాడారు.

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అమెరికాలో మిల్పిటాస్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో లక్కిరెడ్డి కి రోటరీ ప్రతినిధులు “పాల్ హరీష్ ఫెలో పేరు” తో రూపొందించిన అత్యున్నత అవార్డును అందచేసి సత్కరించారు.సిలికానాంధ్రా ఏర్పడి సుమారు 18 సంవత్సరాలు పూర్తియిన సందర్భంగా వార్షిక వేడుకలు నిర్వహించారు.ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ దాదాపు 7 గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన సిలికానాంధ్రా మరొక గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది.సిలికానాంధ్రా సుమారు 221 మంది సభ్యులతో రోటరీ క్లబ్ ని ఏర్పాటు చేసింది.114 ఏళ్ళ రోటరీ చరిత్రలో ఒక్కసారిగా ఇంత మంది సభ్యులతో రోటరీ క్లబ్ ని నెలకొల్పడం లేదని.ఇప్పుడు 221 మందితో క్లబ్ ఏర్పాటు చేయడం రికార్డ్ సృష్టించిందని సిలికానాంధ్రా ఛైర్మెన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు.

తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు