Vadapalli Venkateswara Swamy : ఏడు శనివారాలు ఈ స్వామిని దర్శిస్తే.. కోరికలన్నీ తీరడం ఖాయం..!

కోనసీమ తిరుమలగా అంబేద్కర్ కొనసీమ జిల్లాలోని వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కి ఏడువారాల స్వామి( Yedu Varala Swamy )కి ప్రసిద్ధి.

అయితే ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలను తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు.

శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేయాలి.కలియుగంలో ఎర్రచందన రూపుడిగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి( Vadapalli Venkateswara Swamy )ని ఎందుకు దర్శించాలంటే 1300 కిలోమీటర్ల గోదావరిలో కొట్టుకొచ్చిన స్వామివారి పచ్చని కోనసీమలో 800 సంవత్సరాల కిందట వెలిశారు.

అయితే ఏడు శనివారాలు స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలను తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు.

ఈ క్రమంలో జిల్లా నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ఇక శనివారం రోజు ఆలయం బాగా రద్దీగా ఉంటుంది.ఇక తెల్లవారుజాము నుండి వాడపల్లి వెంకన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.

Advertisement

ఇక స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు.అయితే కలియుగంలో ఏ స్వామిని దర్శిస్తే మనలో బాధలు సమస్యలు( Problems ) మనశ్శాంతితో జీవిస్తామో, ఏ స్వామిని దర్శిస్తే సకల శుభాలు మన కుటుంబాలకు లభిస్తాయో, ఏ స్వామిని దర్శిస్తే అవసరాలకు లోటు ఉండదో, అలాంటి స్వామి కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని అందరూ అంటారు.

అయితే తిరుపతి క్షేత్రం( Tirupati ) తర్వాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి చెల్లింది.ఇక్కడ నిత్యం వేలాది భక్తులు ఉంటారు.ముఖ్యంగా శనివారం( Saturday ) పర్వదినం స్వామిని దర్శించారంటే పెట్టి పుట్టాలనే విధంగా అత్యధిక భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు.

దీంతో పచ్చని కొనసీమ జిల్లా అంత హరినామంతో మారిపోతూ ఉంటుంది.అయితే ఈ గుడికి ఎలా వెళ్లాలంటే రాజమండ్రి నుండి ఆత్రేయపురం మీదుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇక కాకినాడ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం రావులపాలెం మీదగా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట....మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.
Advertisement

తాజా వార్తలు