Sitting on Chair : గంటల తరబడి కుర్చీ మీద కూర్చుంటున్నారా..? అయితే మీ ఆయుష్షు తగ్గినట్లే..!

నేటి రోజుల్లో చాలామంది కుర్చీల మీద గంటల తరబడి( Sitting on Chair ) ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు.

దీంతో చాలామందికి శారీరక శ్రమ తగ్గి స్థూలకాయులుగా మారుతున్నారు.

గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వలన అకాల మరణం ముప్పు పెరుగుతుందని ఇటీవల ఒక పరిశోధన కూడా వెల్లడించింది.మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కూడా ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరమని తేలింది.

ఎక్కువసేపు కూర్చోడం వలన కండరాలు బలహీనపడతాయి.వాటిల్లో రక్తప్రసరణ సరిగ్గా జరగదు.

అలాగే జీవక్రియ బలహీనమవుతుంది.

Advertisement

ఇది గుండె జబ్బులు( Heart Problems ), మధుమేహం, స్ట్రోక్ తో సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.మనిషి బరువు పెరగడం వలన మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు కొవ్వును విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ లైపోప్రొటీన్ లైపేస్ నెమ్మదిగా పనిచేస్తుంది.

దీని వలన బరువు పెరుగుతారు.అంతేకాకుండా బ్లడ్ షుగర్( Blood Sugar ) కూడా పెరుగుతుంది.

దీని వలన ఇన్సూలెన్స్ బ్యాలెన్స్ కూడా చెదిరిపోతుంది.కాబట్టి ప్రతి 30, 60 నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేసి కనీసం మూడు నుండి ఐదు నిమిషాలు చుట్టూ తిరగాలి.

ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వలన కండరాలపై చెడు ప్రభావం పడుతుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

దీని వలన కండరాలలో స్టోర్ అయిన ప్రోటీన్ విరిగి పోయే అవకాశం కూడా ఉంది.దీని వలన కండరాల నష్టం( Muscles )తో పాటు బలం కూడా తగ్గిపోతుంది.కాబట్టి ప్రతిసారి కుర్చీలో నుంచి లేచి కండరాలను సాగదీయాలి.

Advertisement

వారానికి రెండు మూడుసార్లు కండరాల ఎక్ససైజ్ చేయాలి.తొమ్మిది నుండి పది గంటల పాటు ఆఫీసులో కూర్చొని పని చేసేవారికి వెన్ను, మెడ నొప్పులు( Back and Neck Pains ) వస్తూ ఉంటాయి.

ఇవి చిన్న సమస్యలు అయినప్పటికీ జీవితకాల భాదను కలిగిస్తాయి.ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వలన వెన్ను పూసలోని ఇంటర్వర్‌టెబ్రల్ డిస్క్‌లు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలపై ఒత్తిడి పడుతుంది.

దీని వలన వెన్ను, మెడ నొప్పికి కారణం అవుతుంది.

తాజా వార్తలు