టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్( Siddhu Jonnalagadda,Anupama Parameswaran ) లు కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్.ఈ మూవీ ఈ నెల అనగా మర్చి 29 న విడుదల కానున్న విషయం తెలిసిందే.
గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్( DJ Tillu Sequel ) గా ఈ సినిమా తెరకెక్కబోతున్న తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో పది రోజుల్లో ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఇప్పటికీ ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
ఇది ఇలా ఉంటే సినిమా విడుదల తేదీకి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్.సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు, ఆద్యంతం వినోదభరితంగా ఉండే చిత్రాన్ని అందించడానికి చిత్ర బృందం చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.
ముఖ్యంగా టిల్లు పాత్ర, అతను పలికే సంభాషణలు వారిని ఎంతగానో అలరించాయట.
తాజాగా సెన్సార్ బోర్డు( Censor Board ) ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది.టిల్లు స్క్వేర్ చిత్రం( Tillu Square ) డీజే టిల్లును మించిన విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.టిల్లు అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించామని పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన అప్డేట్ లు ఈ మూవీపై అంచనాలను పెంచేసాయి.