డీజే టిల్లు సీక్వెల్ హీరోయిన్ పై దీపావళి సందర్భంగా క్లారిటీ ఇచ్చారు, దీపావళి సందర్భంగా విడుదలైన ఒక వీడియోలో సిద్దు తనదైన స్టైల్ లో హీరోయిన్ ఎవరు అనే విషయమై ఫుల్ క్లారిటీ ఇవ్వడం తో నిన్న మొన్నటి వరకు ఉన్న సస్పెన్స్ కి తెర పడ్డట్లు అయింది.ఈ సినిమా కు దర్శకత్వం ఎవరు అనే విషయం లో కూడా దీపావళి సందర్భం గా క్లారిటీ ఇచ్చారు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా అధికారికం గా క్లారిటీ ఇవ్వడం తో పాటు పూజ హెగ్డే అని అనుకున్నాం కానీ ఆమె బిజీగా ఉండడం వల్ల చేయడం లేదు అంటూ హీరోయిన్ విషయం లో స్పష్టత ఇచ్చారు.
అంతే కాకుండా ఈ సినిమా కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికం గా ప్రకటించారు.
సూర్య దేవర నాగ వంశీ నిర్మాణం లో రూపొందుతున్న డీజే టిల్లు 2 సినిమా భారీ అంచనాల నడుమ వచ్చే సంవత్సరం మార్చి నెల లో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సాధారణం గా తెలుగు సినిమా లకు మార్చి నెల సీజన్ కాదు.
ఎందుకంటే పరీక్షల నెల గా మార్చి నెల ను అంతా పరిగణిస్తారు.

అందుకే మార్చి నెల లో సినిమా లు విడుదల కావు.ఒక వేళ వస్తే మార్చి చివరి వారం లో వస్తాయి తప్పితే మార్చి మొదటి రెండు వారాల్లో సినిమా ల ఊసే ఉండదు.పెద్ద సినిమా ల విడుదల అస్సలే ఉండదు.
అలాంటి మార్చి నెల లో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడం తో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు 2 పై చాలా నమ్మకం తో ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







