టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం భారీ వసూలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.ఇన్నాళ్ల తర్వాత జపాన్ లో థియేటర్ రిలీజ్ కి చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు.
జపాన్ కి వెళ్లి మరి ఎన్టీఆర్ రామ్ చరణ్ మరియు రాజమౌళి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.అక్కడ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసి మంచి కలెక్షన్స్ నమోదు చేయాలని యూనిట్ సభ్యులు భావించారు.
రాజమౌళి తనదైన మార్కు ప్రమోషన్ కార్యక్రమాలు అక్కడ కూడా చేశాడు.

తాజాగా శుక్రవారం విడుదల అయిన సినిమాకు ఒక మోస్తరులో వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఇప్పటికే ఓటీటీ లో చూసేశారో ఏమో కానీ జపాన్ ప్రేక్షకులు థియేటర్లకు బారులు కట్టడం లేదు.మొదటి రోజు హడావుడి కనిపించింది, కానీ ఆ తర్వాత తర్వాత పెద్దగా సందడి లేకుండా పోయింది.
వీకెండ్ వరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ చూస్తే నిరాశే తప్పదు.సినిమా కు జపాన్ లో పబ్లిసిటీ చేయడం కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు.
ఆ మాత్రం వచ్చినా కూడా ఇప్పుడు పర్వాలేదు అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.జపాన్ లో విడుదల అవ్వడం ద్వారా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకోవడం కోసం జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే ఎక్కువ దేశాల్లో విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారని.అందులో భాగంగానే జపాన్ లో విడుదల చేశారని, కలెక్షన్స్ విషయమై పెద్దగా పట్టింపు లేదని చిత్ర యూనిట్ సభ్యులు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







