బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారింది.దీని ప్రభావంతో బెంగాల్, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
దీంతో అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.రేపు బంగ్లాదేశ్ లోని బరిసాల్ దగ్గర తుఫాన్ తీరం దాటనుంది.
ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.







