సమంత, సిద్దు ప్రాజెక్ట్‌ అటకెక్కినట్లేనా?

డీజే టిల్లు సినిమా తో ప్రేక్షకులను అలరించి యూత్ లో ఫాలోయింగ్ దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddu jonnalagadda ) ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు టిల్లు మూవీ సీక్వెల్‌ తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

 Siddu Jonnalagadda And Samantha Movie Canceled , Samantha Movie, Siddu Jonnalaga-TeluguStop.com

ఇదే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణం లో ఒక సినిమా ను చేయబోతున్నట్లుగా సిద్దు జొన్నలగడ్డ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది.

Telugu Nandini Reddy, Samantha-Movie

ఈ సినిమా కు ముందు నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వం లో సమంతతో కలిసి సిద్దు జొన్నలగడ్డ ఒక సినిమా ను చేయాల్సి ఉంది.కానీ సమంత ( Samantha )ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.అదే సమయం లో నందిని రెడ్డి మరో ప్రాజెక్టు పై బిజీగా మారబోతుంది.

కనుక వారిద్దరి కోసం వెయిట్ చేయడం కంటే తాను కొత్త సినిమా ని మొదలు పెట్టడం కరెక్ట్ అనే ఉద్దేశం తో బొమ్మరిల్లు భాస్కర్ ( Bommarillu Bhaskar )చెప్పిన కథ కు సిద్దు జొన్నలగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతుంది.దాంతో సమంత, సిద్దు ల మూవీ పూర్తిగా అటకెక్కినట్లే అంటున్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమా( DJ Tillu movie ) తో సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.

Telugu Nandini Reddy, Samantha-Movie

ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసే విధంగా వరుసగా సినిమాలు చేయాలని ఉద్దేశంతో కాస్త స్లోగానే మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.అయితే బొమ్మరిల్లు భాస్కర్ ఆ మధ్య పూర్తిగా డల్ అయ్యాడు.ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు.అలాంటి దర్శకుడి తో ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా అంటే కాస్త రిస్కీ ప్రాజెక్టు అనుకోవాలి.

మరి ఈ రిస్కీ ప్రాజెక్టు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube