నిజ జీవితంలో హీరోయిన్ ని భయపెట్టిన ఎర్ర చీర దెయ్యం

ఈ మధ్యకాలంలో హర్రర్ కామెడీ చిత్రాలు అన్ని ఇండస్ట్రీలలో భాగా ఫేమస్ అయిపోయాయి.భయపెట్టి నవ్వించడానికి దర్శకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

భయం ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కామెడీ అనే విషయం గ్రహించిన దర్శకులు తక్కువ బడ్జెట్ తో ఆ తరహా సినిమాలు తీసి హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు.రాఘవ లారెన్స్ లాంటి దర్శక హీరోలు అయితే దెయ్యాలతో సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే నిజంగా నిజ జీవితంలో దెయ్యాలు ఉన్నాయా అంటే చాలా మంది ఉన్నాయనే అంటారు.అయితే దెయ్యం ఎలా ఉంది అంటే మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేరు.

అందుకే చాలా మంది సరదాగా దెయ్యాల గురించి మాట్లాడుతూ దెయ్యం ఎప్పుడు రాత్రి పూట అది కూడా తెల్లచీర కట్టుకునే కనిపిస్తుందా అంటూ సెటైర్ లు వేస్తూ ఉంటారు.అయితే మనిషిలో అంతర్లీనంగా ఉన్న భయం హిస్టీరియాగా బయటకి రావడమే దెయ్యం పట్టడం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు.

Advertisement

ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమా ప్రేమకథా చిత్రమ్ కి సీక్వెల్ వస్తుంది అందులో ఒక హీరోయిన్ గా నటించిన సిద్ధీ ఇద్నాని తనకి నిజజీవితంలో కూడా దెయ్యం చూసిన అనుభవం ఉందని చెబుతుంది.ఓ సారిలో కారులో వెళ్తూ ఉంటే సడెన్ గా డ్రైవర్ కారు ఆపేసాడు.

ఎం జరిగిందా అని చూస్తే ఓ ఎర్ర చీర దెయ్యం కారు దగ్గరకి వచ్చి మాయం అయ్యింది అంటూ స్టొరీ చెప్పుకొచ్చింది.అలాంటి వాస్తవంగా తనకి జరిగిన అనుభవంతో సినిమా తీస్తే అందులో నటించాలని ఉందని కూడా చెప్పింది.

మరి అది జరుగుతుందో లేదో అనేది వేచి చూడాలి.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు