Siddharth : ఆ హీరోయిన్ తో ప్రేమ కన్ఫామ్ చేసిన సిద్ధార్థ్.. నా ప్రాణం అయినా ఇస్తానంటూ..!!

ఈ మధ్యకాలంలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణం నడుస్తుంది.అందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ రష్మిక మందన్న( Vijay Deverakonda,Rashmika mandanna ).

 Siddharth Who Confirmed His Love With That Heroine I Would Give My Life-TeluguStop.com

సిద్ధార్థ్ అదితి రావు హైదరి( Siddharth, Adithi Rao Hydari ).ఇక ఇందులో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తమ లవ్ ట్రాక్ బయట పెట్టకుండా రహస్యంగా రిలేషన్ కొనసాగిస్తున్నప్పటికీ సిద్ధార్థ్ మాత్రం అదితి తో ఎక్కడికి వెళ్లినా మీడియాకి అడ్డంగా బుక్కైతూ వస్తున్నారు.కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందా అనే ప్రశ్న ఎదురైనప్పుడు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.అయితే తాజాగా సిద్ధార్థ్ చేసిన కామెంట్లు అదితీ రావు హైదరితో ప్రేమ కన్ఫామ్ చేశాయి.

Telugu Reels, Love, Siddharth-Latest News - Telugu

ఇక అసలు విషయంలోకి వెళ్తే.సిద్ధార్థ్ హీరోగా “చిన్నా( Chinna Movie )” అనే సినిమా అక్టోబర్ 6 అనగా ఈరోజు థియేటర్లలో విడుదల కాబోతుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలవనుండగా థియేటర్లు ఖాళీగా లేకపోవడంతో అక్టోబర్ 6 కి వాయిదా వేశారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.

ఇక ప్రెస్ మీటింగులో చాలామంది రిపోర్టర్లు హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలు కూడా అడిగి తెలుసుకుంటారు.

Telugu Reels, Love, Siddharth-Latest News - Telugu

ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ లేచి రీసెంట్ గా మీరు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు.అసలు కారణం ఏంటో చెప్పగలరా అని అడిగాడు.దానికి సిద్ధార్థ్ స్పందిస్తూ.

అసలు నాకు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అనేది ఇష్టం ఉండదు.కానీ ప్రాణంగా ప్రేమించే వాళ్లకోసం ఇలాంటి పనులన్నీ చేయక తప్పడం లేదు అంటూ సిద్ధార్థ్ ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు.

ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఈ కామెంట్లను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు అతిథి రావు హైదరీ తో సిద్ధార్థ్ తన ప్రేమను కన్ఫామ్ చేశారని, ఎందుకంటే ఎక్కువగా సిద్ధార్థ్ అదితి తో కలిసే ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు.ఇక దీని బట్టి చూస్తే అదితి రావు హైదరి సిద్ధార్థ్ మధ్య ప్రేమ నిజమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube