క్యూట్ భామని వదిలేసి హాట్ భామతో హీరో అఫైర్

బాలివుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ మల్హోత్రా ఈమధ్య తరుచుగా వార్తల్లో ఉంటున్నాడు.అది తన సినిమాల వలన అయితే బాగుండేది‌.

 Siddharth Malhotra Breaks Up With Alia Bhatt For Jacqueline-TeluguStop.com

కాని సినిమాల వలన కాదు, పర్స్ నల్ లైఫ్ వలనే.విషయం ఏమిటంటే, ఈ లవర్ బాయ్ గత కొన్నేళ్ళుగా ఆలియాభట్ తో లవ్ లో ఉన్నాడు.

ఇద్దరు ఒకే సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో తెరంగేట్రం చేసారు కదా, అప్పటినుంచే వీరి మధ్య కుచ్ కుచ్ హోతా హై.వీరి ప్రేమ ఎంత ముదిరింది ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్ తీసుకోని, కలిసి ఉండేంతగా.కాని ముదిరిన ఆకులు రాలిపోతాయి అంటారు.అదే జరిగినట్లు ఉంది.

ఆలియా, సిద్దార్థ్ విడిపోయారని ప్రస్తుతం బాలివుడ్ లో టాక్‌‌.దానికి కారణం బాలివుడ్ హాట్ బ్యూటి జాక్వేలీన్ ఫెర్నాండెజ్ అని తెలుస్తోంది.

జాక్వేలిన్ సిద్ధార్థ్ కలిసి ఏ జెంటిల్మన్ అనే సినిమా చేసారు.ఈ సినిమా షూటింగ్ సమయములోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పుట్టి, పెరిగిందట‌.

ఇద్దరు ఆలియా కళ్ళుగప్పి ఏవేవో పనుల చేసారట‌.ఈ విషయాలు ఆ చెవి నుంచి, ఈ చెవి నుంచి ఆలియా దాకా చేరటంతో మొదట సిద్దార్థ్ ని హెచ్చరించిదట‌.

జాక్వేలిన్ కి దూరంగా ఉండాలని చెప్పిందట‌.అయినా ఆలియా మాటలు పట్టించుకోని సిద్ధార్థ్, జాక్వేలిన్ కి ఇంకా దగ్గర కావడంతో ఆలియా చేసేదేమి లేక బ్రేకప్ చెప్పేసిందట‌.

ఇక్కడ బాలివుడ్ జనాలకి అర్థం కాని విషయం ఏమిటంటే, ఇటు ఆలియా, అటు జాక్వేలిన్ .ఇద్దరు సిద్ధార్థ కంటే పెద్ద స్టార్లు.అలాంటి టాప్ హీరోయిన్లని ఈ కుర్ర హీరో మాయ చేసి పడేస్తున్నాడో అర్థం కావడం లేదు బీ టౌన్ వారికి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube