నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీ రిలీజ్ కు ఎమోషనలైన సిద్ధార్థ్.. సినిమా అనేది లైఫ్ అంటూ?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ సినిమాల విషయంలో బాగా ఎమోషనల్ అవుతూ ఉంటారు.ఎందుకంటే ఏదైనా సినిమా తమకు మంచి సక్సెస్ అందిస్తే.

ఆ సినిమా నుండి వచ్చిన గుర్తింపు వారికి ఆనంద భాష్పాలను అందిస్తుంది.ఇక ఆ సినిమా తమ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అన్నట్లుగా ఉండటంతో.

ఎప్పటికైనా ఆ సినిమాను మర్చిపోకుండా గుర్తుకు చేసుకుంటూ ఉంటారు.అయితే ఈమధ్య స్టార్ హీరోలకు కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు థియేటర్లో మరోసారి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రేక్షకులు కూడా గతంలో మంచి మంచి హిట్టు అందుకున్న సినిమాలను మరోసారి థియేటర్లో చూడటానికి ఇష్టపడుతున్నారు.అయితే హీరో సిద్ధార్థ్, త్రిష కలిసి నటించిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.

Advertisement

ఈ సినిమా ఎంతలా బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుందో చూసాం.అయితే ఈ సినిమాను తాజాగా థియేటర్లో మరోసారి విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించాడు.ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించాడు.కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఇక ఈయన తెర ముందు ఎంత సైలెంట్ గా ఉంటాడో తెరవెనుక మాత్రం బాగా వైలెంట్.ముక్కుసూటిగా తన నోటికి వచ్చే విధంగా అవతలి వారి పై విమర్శలు చేస్తూ ఉంటాడు.

Advertisement

ఈయన 2003లో బాయ్స్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమా తనకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత బొమ్మరిల్లు, ఆట వంటి పలు సినిమాలలో కూడా నటించాడు.

ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మాత్రం అతడికి మంచి సక్సెస్ ని అందించింది.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు కొన్ని వివాదాలు రావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు.కారణం ఏంటంటే సినిమాలతో తనకొచ్చిన బాగా గర్వం రావడంతో.ఇండస్ట్రీలో ఓవర్గా ప్రవర్తించాడు.

దర్శక నిర్మాతలతో ఎక్స్ట్రాలు మాట్లాడాడు.దింతో అతడికి సినిమాలలో అవకాశాలు లేకుండా చేశారు.

మళ్లీ ఇంత కాలానికి  అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఈ సినిమా అంతంత మాత్రమే సక్సెస్ అయింది.ఇక ఇతడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

తనకు నెగెటివ్ కామెంట్లు వస్తే మాత్రం తన నోటికొచ్చిన బూతులతో నెటిజన్లను తిడుతుంటాడు.దీంతో సిద్ధార్థ్ కి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి బాగా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమా థియేటర్లో మళ్లీ విడుదల చేయగా.దానికి సంబంధించిన ఫోటోలు స్టోరీస్ ద్వారా పంచుకుంటూ ఉన్నాడు.అంతేకాకుండా ఆ సినిమాలోని డైలాగ్ కూడా చెబుతూ అందరినీ మరోసారి ఆ సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.

ఇక థియేటర్లో ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులను చేసి చాలా సంబరపడిపోయాడు.థియేటర్లో సందడి చేసిన ఫోటోలు కూడా పంచుకున్నాడు.అయితే ఆ ఫోటోలు షేర్ చేస్తూ.

సినిమా అనేది లైఫ్ అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించాడు.నిజానికి టాలీవుడ్ లో ఆయన అప్పుడు ఆ విధంగా ప్రవర్తించకపోతే ఇప్పుడు స్టార్ పొజిషన్లో ఉండేవాడు.

తాజా వార్తలు