అలా షో ఆఫ్ చేస్తే దేవుడు శిక్షిస్తాడు.. శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న శృతి హాసన్( Shruti Haasan ) సలార్, హాయ్ నాన్న సినిమాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు.హాయ్ నాన్న సినిమాలో చిన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు.

 Shruti Hassan Comments Goes Viral In Social Media Details Here Goes Viral ,shru-TeluguStop.com

సినిమా సినిమాకు శృతి రేంజ్ పెరుగుతుండగా తాజాగా ఒక సందర్భంలో శృతి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తన ఆరోగ్యం గురించి శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

గత కొద్దిరోజులుగా నేను ఫ్లూ సమస్య( Flu )తో బాధ పడుతున్నానని ఆమె తెలిపారు.అయినప్పటికీ నేను బాగానే ఉన్నానని చెప్పుకుంటున్నానని శృతి హాసన్ తెలిపారు.

ఈ విధంగా షోఆఫ్ చేస్తే మాత్రం దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని శృతి హాసన్ పేర్కొన్నారు. కరోనా( Corona ) సమయంలో పడిన బాధతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.నాకు జ్వరం లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె తెలిపారు.నాకు డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని అయితే ఇది డెంగ్యూ( Dengue ) కాకూడదని కోరుకుంటున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 26వ తేదీ వరకు నాకు ఎలాంటి లక్షణాలు లేకుండా చూడాలని ఆమె అన్నారు.అయితే ఆ తేదీకి శృతి హాసన్ ప్రాధాన్యత ఇవ్వడం వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది.

శృతి హాసన్ అటు గ్లామర్ రోల్స్( Shruti Haasan Roles ) కు మరోవైపు అభినయ ప్రధాన పాత్రలకు ఓకే చెబుతున్నారు.ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో శృతి పారితోషికం( Shruti Haasan Remuneration ) తీసుకుంటున్నారు.సీనియర్ హీరోలకు సైతం జోడీగా నటించడానికి శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

శృతి హాసన్ భవిష్యత్తులో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube