ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది.ఈ క్రమంలో కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం చేయాల్సి ఉందని ఏపీ తెలిపింది.
మరోవైపు నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని తెలంగాణ కోరింది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై నవంబర్ 15వ తేదీ లోపు అభిప్రాయం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై తదుపరి విచారణను నవంబర్ 22, 23వ తేదీల్లో ట్రిబ్యునల్ చేపట్టనుంది.కాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.