పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)తాజాగా సలార్ (Salaar)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అభిమానుల అంచనాలను చేరుకుందని చెప్పాలి.
బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమా ప్రభాస్ కు విజయం సాధిస్తుందన్న నమ్మకాలు అందరిలోనూ కలుగుతున్నాయి ఇప్పటికే బెనిఫిట్ షోలు పూర్తి కావడంతో ఈ సినిమాపై ఎంతోమంది పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటి శృతిహాసన్ (Shruti Haasan) నటించిన విషయం మనకు తెలిసిందే.
మొదటిసారి ఇలా శృతిహాసన్ ప్రభాస్ కాంబినేషన్లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమాలో శృతిహాసన్ పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత లభించిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శృతిహాసన్ సినిమా గురించి అలాగే నటుడు ప్రభాస్ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రభాస్ ని బాగా టార్చర్ పెట్టాను అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.మరి ప్రభాస్ ను శృతిహాసన్ ఏ విషయంలో అంతలా టార్చర్ చేసింది ఏంటి అనే విషయానికి వస్తే.ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఈమె ఏమాత్రం విరామం దొరికిన చిత్ర బృందంతో కలిసి మాట్లాడుతూ ఉండేవారట.
శృతిహాసన్ మామూలుగానే కాస్త ఎక్కువగా మాట్లాడతారనే విషయం తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో( Salaar Shooting ) ప్రభాస్ గారితో కలిసి తాను మరింత ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదాన్ని అని తెలిపారు.ఇలా ఆయనతో భారీగా మాట్లాడుతూ తన మాటల ద్వారా ప్రభాస్ ను టార్చర్ పెట్టానని శృతిహాసన్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా నేను మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం ఎలాంటి విసుగు చెందకుండా తనతో నవ్వుతూనే మాట్లాడే వారిని శృతిహాసన్ తెలియజేశారు.నా వాగుడిని ప్రభాస్ తట్టుకున్నారు అంటే నిజంగానే ఆయనకు ఎంతో సహనం ఉందని ఆ క్షణమే అర్ధమైందనీ తెలిపారు.
ఇక ఈ సినిమా షూటింగ్ జరిగిన రోజులన్నీ కూడా తాను చాలా సరదాగా సినిమా షూటింగ్లో పాల్గొన్నానని ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో ప్రభాస్ కి జోడిగా ఈ సినిమా చేయటం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నానని శృతిహాసన్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలా శృతిహాసన్ ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక ప్రభాస్ వ్యక్తిగతంగా ఎంతో మంచి మనస్తత్వం కలిగినటువంటి నటుడు అనే విషయం మనకు తెలిసిందే.ఈయన మంచితనం గురించి ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తెలియజేశారు.
తాజాగా శృతిహాసన్ కూడా ప్రభాస్ మంచితనంపై ఆయనకు ఉన్నటువంటి సహనం గురించి ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.