అలా చూసుకునే వ్యక్తి ప్రపంచంలో లేరు.. శృతి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Shruti Haasan Shocking Comments On Boy Friend Santanu Hazarika Goes Viral In Social Media Details, Shruti Haasan, Santanu Hazarika, Shruti Haasan Boy Friend, Salaar Movie, Prabhas, Shruti Haasan Santanu, Prasanth Neel, Heroine Shruti Haasan

సంక్రాంతికి రెండు సినిమాలతో విజయాలను అందుకున్న శృతి హాసన్ సలార్ తో ఈ ఏడాది హ్యాట్రిక్ సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శృతి హాసన్ శాంతను హజారికాతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

 Shruti Haasan Shocking Comments On Boy Friend Santanu Hazarika Goes Viral In Soc-TeluguStop.com

శృతి, శాంతను విడిపోయారని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే.శృతి హాసన్ తన ఇన్ స్టా స్టోరీస్ లో “ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా ఎవరూ చూసుకోలేరు” అని పేర్కొన్నారు.

శాంతను హజారికా తనను ఎంతలా ప్రేమించారో ఈ కామెంట్ ద్వారా శృతి చెప్పకనే చెప్పేశారు.శాంతనుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ శృతి హాసన్ ఈ కామెంట్ చేశారు.

సలార్ సినిమాలో శృతి హాసన్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారని తెలుస్తోంది.అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ ను శృతి హాసన్ ఎంచుకుంటున్నారు.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

Telugu Shruti Haasan, Prabhas, Prasanth Neel, Salaar, Shrutihaasan-Movie

ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.శృతి హాసన్ ఇప్పటివరకు కనిపించని తరహా పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో సీన్లు అద్భుతంగా ఉంటాయని సమాచారం.ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ప్రభాస్ ఈ సినిమా తన కెరీర్ లో మరపురాని సినిమా అవుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Shruti Haasan, Prabhas, Prasanth Neel, Salaar, Shrutihaasan-Movie

100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ స్టార్ హీరో సర్వేలలో సైతం నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ తన సినిమాలతో ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.హీరోయిన్ శృతి హాసన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube