అలా చూసుకునే వ్యక్తి ప్రపంచంలో లేరు.. శృతి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సంక్రాంతికి రెండు సినిమాలతో విజయాలను అందుకున్న శృతి హాసన్ సలార్ తో ఈ ఏడాది హ్యాట్రిక్ సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శృతి హాసన్ శాంతను హజారికాతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

శృతి, శాంతను విడిపోయారని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే.

శృతి హాసన్ తన ఇన్ స్టా స్టోరీస్ లో "ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా ఎవరూ చూసుకోలేరు" అని పేర్కొన్నారు.

శాంతను హజారికా తనను ఎంతలా ప్రేమించారో ఈ కామెంట్ ద్వారా శృతి చెప్పకనే చెప్పేశారు.

శాంతనుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ శృతి హాసన్ ఈ కామెంట్ చేశారు.

సలార్ సినిమాలో శృతి హాసన్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారని తెలుస్తోంది.అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ ను శృతి హాసన్ ఎంచుకుంటున్నారు.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. """/" / ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

శృతి హాసన్ ఇప్పటివరకు కనిపించని తరహా పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో సీన్లు అద్భుతంగా ఉంటాయని సమాచారం.

ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ప్రభాస్ ఈ సినిమా తన కెరీర్ లో మరపురాని సినిమా అవుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.

"""/" / 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ స్టార్ హీరో సర్వేలలో సైతం నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ తన సినిమాలతో ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.

హీరోయిన్ శృతి హాసన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్నారు.

Hero Naveen Polishetty : రోడ్డుప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు..!