మంచు వర్షంలో ఎంజాయ్ చేస్తున్న శృతిహాసన్.. ఫోటోలు వైరల్!

ప్రస్తుతం తీవ్రమైన చలితో ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంటే నటి శృతిహాసన్ మాత్రం ఏకంగా మంచు వర్షంలో ఎంజాయ్ చేస్తూ చాలా థ్రిల్ అవుతున్నారు.భారీగా మంచు వర్షం కురుస్తుండగా ఈమె మాత్రం మంచు వర్షంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బాగా చిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

 Shruti Haasan Enjoying The Snow Rain Photos Viral Details, Shruti Haasan , Shrut-TeluguStop.com

ప్రస్తుతం శృతిహాసన్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ వంటి హీరోలందరితో కలిసి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో కేవలం రెండు పాటల చిత్రీకరణ ఉండడంతో చిత్ర బృందం మొత్తం యూరప్ వెళ్లారు.

Telugu Chiranjeevi, Shruti Haasan, Shrutihaasan-Movie

ఈ క్రమంలోనే యూరప్ పర్యటనకు సంబంధించిన విషయాలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఒకవైపు తన ఫ్యామిలీతో కలిసి యూరప్ లో ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్.ఇక ఈ పాటల చిత్రీకరణ సమయంలో భాగంగా శృతిహాసన్ మంచు వర్షంలో తడిసి ముద్దవ్వడమే కాకుండా యూరప్ అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం శృతిహాసన్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube