శృతి హాసన్ ని అలాంటి ప్రశ్న అడిగిన నెటిజన్.. క్రేజీ ఆన్సర్ ఇచ్చిన శృతి?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్( Shruti Haasan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కమలహాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Shruti Haasan Crazy Answert To Netizen Strange Question, Shruti Haasan,tollywood-TeluguStop.com

ప్రస్తుతం శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి( Veera Simha Reddy ) సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Telugu Commentd, Netizen, Shruti Haasan, Tollywood-Movie

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా( Social Media )లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇకపోతే ఈమె ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా( Shantanu Hazarika )తో కలిసి ముంబైలోనే ఒక అపార్ట్మెంట్ లో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో శృతిహాసన్ తరచూ అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ, విచిత్రమైన ప్రశ్నలు వేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది.కాగా తాజాగా కూడా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తుండగా కొన్ని వింతైన ప్రశ్నలు ఆమెకి ఎదురయ్యాయి.

Telugu Commentd, Netizen, Shruti Haasan, Tollywood-Movie

కొందరు నెటిజన్లు అడిగిని కొంటె ప్రశ్నలకు శృతి కూడా అంతేక్రేజీగా సమాధానం ఇచ్చింది.అయితే ఈ సారి ఫోటోలకు సంబంధించిన క్యూ అండ్‌ ఏ జరిగింది.ఇందులో చిన్నప్పటి ఫోటో పెట్టమని ఒకరు, రెడ్‌ డ్రెస్‌లో ఫోటోని పంచుకోమని, బాయ్‌ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోని షేర్‌ చేయమని, ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.అందులో భాగంగా ఒక నెటిజన్‌ వింతైన ప్రశ్న అడిగాడు.

తన పాదాల ఫోటో చూపించమన్నాడు.దీనికి షాక్ అయిన శృతి ఒక క్రేజీ ఫోటో వదిలింది.

అది ఒక వింత జంతువో లేక, ఏలియన్‌ కాళ్లో తెలియదు కానీ చాలా వింతంగా ఉన్నాయి.ఆ దెబ్బకి నెటిజన్‌కి దిమ్మతిరిగిపోవడం విశేషం.

ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇదే కాదు ఇంకా విచిత్రమైన, పర్సనల్‌ క్వచ్ఛన్స్ కూడా ఎదురయ్యాయి.

ఆయా ప్రశ్నలను సైతం ఆమె ఇన్ స్టా స్టోరీస్‌( Insta Stories )లో పంచుకుంది.అయితే శృతిహాసన్ చేసిన పనికి అభిమానులు మెచ్చుకుంటున్నారు.

ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో మా హీరోయిన్ కి బాగా తెలుసు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక కొందరు అడిగిన ప్రశ్నలకు కూల్ గానే సమాధానం చెప్పింది శృతిహాసన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube