ఈ మధ్య కాలంలో అందాల భామలు సినిమాలు పక్కన పెట్టి వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.కొంత మంది ఫేడ్ అవుట్ హీరోయిన్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ లలో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయిపోగా మరికొంత మంది భామలు ఆ దారిలో వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు.
భవిష్యత్తు అంతా వెబ్ సిరీస్ లదే హవా అని ముందే గ్రహించిన వారు దానికి తగ్గ ప్లాట్ ఫాం సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కమల్ హసన్ కూతురు శృతి హసన్ కూడా వెబ్ సిరీస్ లవైపు దృష్టి పెట్టి ఏకంగా హాలీవుడ్ వెబ్ సిరీస్ లో అవకాశం సొంతం చేసుకుంది.
ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా శృతి ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ట్రెడ్‌స్టోన్ లో శృతి హస అవకాశం దక్కించుకుంది.
ఢిల్లీలోని ఓ హౌటల్‌లో వెయిట్రెస్‌గా పనిచేస్తూ హత్యలు చేసే నీరా పటేల్ అనే ఏజెంట్‌గా శృతి ఇందులో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ కోసం శృతి హసన్ త్వరలోనే హంగేరీలోని బుడాపెస్ట్‌కు వెళ్లనుందని తెలుస్తుంది.
ఈ వెబ్ సిరీస్ వర్క్ అవుట్ అయితే ఇక అమ్మడు హాలీవుడ్ లో సెటిల్ అయిపోవచ్చని భావిస్తుంది.దాని కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుంటుంది.