Shruti Haasan : ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్.. ఎంతో గౌరవం ఇస్తారంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ ( Shruthi Haasan ) త్వరలోనే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా( Salaar Movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె మొదటిసారి ప్రభాస్ సరసన ఈ సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Shruthi Hassan Comments About Prabhas-TeluguStop.com

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రసారం కాబోతున్నటువంటి నేపథ్యంలో తాజాగా శృతిహాసన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Salaar, Actressshruti, Prabhas, Prashanth Neel, Tollywood-Movie</div ఇటీవల హైదరాబాద్ లో సందడి చేసినటువంటి శృతిహాసన్ సినిమా గురించి మాట్లాడారు సినిమా కోసం తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలియజేశారు.ఇక ఈమె ప్రభాస్ ( Prabhas ) గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం ఆయనలో ఉంది అంటూ తెలియచేశారు.ఆయన చాలా హంబుల్ పర్సన్ ఇతరులకు ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడతారు.

ఇక ఏదైనా ఒక సన్నివేశాన్ని చేసే సమయంలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న మనం ఏదైనా తప్పు చేస్తే సర్దుకుని పోయే వ్యక్తిత్వం ప్రభాస్ ది అంటూ ఈమె తెలియజేశారు.

Telugu Salaar, Actressshruti, Prabhas, Prashanth Neel, Tollywood-Movie</div ఇలా పరవాలేదు అంటూ మరో టేక్ తీసుకోవడమే కాకుండా తోటి సెలబ్రిటీలను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా శృతిహాసన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.ఇలా ప్రభాస్ గురించి శృతిహాసన్ ఎంతో గొప్పగా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారి ప్రభాస్ అభిమానులను ఎంతో సంతోషానికి గురి చేస్తున్నాయి.అయితే ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఆయనపై ఇదేవిధంగా ప్రశంసల కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube