కేంద్రాన్ని రెచ్చగొడుతున్న శివసేన

భాజపా మిత్రపక్షమైన శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నది.ఏ విషయంలో? పాకిస్త్తాన్ విషయంలో.మీకు దమ్ముంటే పాకిస్తాన్ మీద దాడి చేయండి అని శివసేన కేంద్రాన్ని సవాల్ చేసింది.శివసేన ఆగ్రహానికి కారణం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు తరచుగా భారత్ మీద దాడులు చేస్తుండటమే.

 Show Guts, Attack Pakistan: Shiv Sena Tells Centre-TeluguStop.com

శివసేన తన అధికార పత్రిక సామ్నాలో పాక్ మెదడ దాడులు చేయాలని డిమాండ్ చేసింది.పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సైన్యానికి సవాళ్లు విసురుతున్నారని పేర్కొంది.పాకిస్తాన్ మంత్రులు, ఉగ్రవాదులు మనల్ని బెదిరిస్తున్నా మనం నవ్వి ఊరుకుంటూ పట్టించుకోవడంలేదని విమర్శించింది.పాక్ ఉగ్రవాదుల కారణంగా భారత్ అనేకమంది సైనికులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

శివసేన ఆవేదనను మనం కాదనలేము.అది చెప్పిన దాంట్లో అవాస్తవం లేదు.

కాని పాక్ మీద యుద్ధం చేయడం సమస్యకు పరిష్కారం కాదు.దీనివల్ల వేలాదిమంది సైనికులను కొల్పొవాల్సి వస్తుంది.

ఒక దేశం మరో దేశం మీద దాడి చేయడం అంత సులభం కాదు.పాక్ మీద దాడి చేస్తే ఉగ్రవాదం నశిస్తుందని అనుకోవడం భ్రమ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube