సినిమా కోసం నూరు శాతం కష్టపడే అతి తక్కువ మంది నటుల్లో అల్లు అర్జున్ ఒకరు.రుద్రమదేవి సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా, దానికోసం తన ఆహార్యాన్ని మార్చుకున్నారు ఆయన.
అక్కడితో ఆగకుండా ఈ చిత్రం కోసం తెలంగాణ యాస కూడా నేర్చుకున్నారు.
బన్ని భార్య స్నేహరెడ్డిది తెలంగాణ.
తన భార్య తెలంగాణ మాండలికంలోనే మాట్లాడటం, దానితో పాటు స్నేహ బంధువులు కుడా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నప్పుడు బన్ని బాగా గమనిన్చేవాడట.అది రుద్రమదేవి సినిమాకి చాలా ఉపయోగపడిందని స్వయంగా బన్ని తెలిపారు.
” సినిమాల్లో చూపించే తెలంగాణ యాస స్వచ్చమైనది కాదు, తెలంగాణ యాస అంటే కేవలం హైదరాబాద్ పరిసారాల్లో వినిపించేది కాదు.గ్రామాల్లో చాలా స్వచ్చమైన తెలంగాణ మాట్లాడుతారు.
నేను కుడా ఆ గ్రామాల్లో ఉండే సహజమైన తెలంగాణ యాస మాట్లాడడానికే ప్రయత్నించా.నా భార్యది తెలంగాణ కావడం నాకు చాలా ఉపయోగపడింది”
.






