మనం ఇంట్లో బట్టలు ఉతికి అవి త్వరగా ఆరడానికి వాటిలో నీటిని పిండుతాం అని మనందరికీ తెలిసిందే.మనం వాడే టవల్ ని కూడా అంతే.
తడిగా ఉండే టవల్ త్వరగా ఆరడానికి పిండటం చేస్తుంటాం.అలా పిండుతున్నప్పుడు ఆ టవల్ లోని నీరు కిందపడిపోతుంది.
ఇలాంటి తడి టవల్ నే ఒకవేళ అంతరిక్షంపై పిండితే ఏం జరుగుతుందో తెలుసా.? అసలు దీని గురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? అంతరిక్షంపై ఏదైనా తడి వస్తువులను పిండితే ఏం జరుగుతుందో ఇప్పుడైనా తెలుసుకుందాం.
తాజాగా స్పేస్ సెంటర్‌లో జరిగిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో అంతరిక్ష కేంద్రంలో ఓ ఆస్ట్రోనాల్ తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో చూడండి అంటూ ఓ ప్రయోగం చేసి చూపాడు.
టవల్ ని పిండగానే.టవల్‌తో ఉన్న వాటర్ కిందపడిపోకుండా.టవల్ చుట్టూ ఒక ట్యూబ్ లా.ఒక పొర మాదిరిగా ఏర్పడింది.అయితే, దీనంతటికీ కారణం గురుత్వారక్షణ శక్తి.

స్పేస్ స్టేషన్‌లో పనిచేసే వ్యోమగాములకు మన ఇళ్లలో వాడే టవల్స్ వంటివి ఇవ్వరు.వారికి ప్రతీదీ ప్యాక్ చేసి… వీలైనంత చిన్నగా ఉండేవి ఇస్తారు.తినే ఆహారం, తానే నీరు అన్నీ ప్యాకెట్ల రూపంలోనే లభిస్తాయి.
అందువల్ల తాము వాడే టవల్ ఎలా ఉంటుందో… 2013లోనే యూట్యూబ్‌లోని ఓ వీడియోలో వివరించారు క్రిస్ హాడ్‌ఫీల్డ్.టవల్ చుట్టూ నీరు అలా ట్యూబులా ఏర్పడటానికి కారణం నీటికి ఉన్న సర్ఫేస్ టెన్షన్ గుణమే.
నీటి అణువులు ఒకదానికి ఒకటి కలిసివుంటాయి.వాటిని ఆకర్షణ శక్తి లాగకపోతే… అవి ద్రవరూప జెల్ లాగా ప్రవర్తిస్తాయి.“అప్పుడు మన చేతిలో జిగురు ఉన్నట్లే అనిపిస్తుంది” అని వ్యోమగామి తెలిపారు.దీనికి సంబంధించిన వీడియోను ‘కెనడియన్ నాసా ఏజెన్సీ’ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.
అది వైరల్‌గా మారింది.







