ప్రతీ వారం నామినేషన్స్ లో అమర్ దీప్ ఉండాల్సిందేనా..? నాగార్జున కామెంట్స్ అలాగే ఉన్నాయి!

ఈ సీజన్ బిగ్ బాస్( Big Boss ) ప్రారంభం అయ్యి దాదాపుగా 10 వారాలు అవుతుంది.ఈ పది వారాల్లో ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా నామినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది అమర్ దీప్( Amar Deep ) మాత్రమే అని చెప్పొచ్చు.

 Should Amardeep Be In The Nominations Every Week Nagarjuna's Comments Remain Th-TeluguStop.com

శివాజీ ( Shivaji) మరియు అతని బ్యాచ్ అమర్ దీప్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు, అతన్ని తక్కువ చేసి చూపించడానికి చేసిన ప్రయత్నాలు జనాలు చూస్తూనే ఉన్నారు.కానీ న్యాయం మాత్రం దక్కడం లేదు.

ముఖ్యంగా హోస్ట్ గా ఉంటూ సమంగా తీర్పు చెప్పాల్సిన అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) లాంటి వాడే ఒక వైపే మాట్లాడుతూ ఉండడం తో ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు.గత వారం శివాజీ మరియు అతని గ్యాంగ్ అమర్ దీప్ పై ఎలాంటి సిల్లీ నామినేషన్స్ వెయ్యడానికి చూసారో మనమంతా గమనించాము.

నామినేషన్స్ పాయింట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల రాజమాతలు అమర్ దీప్ ని నామినేట్ చెయ్యలేదు.

Telugu Amardeep, Big Boss, Nagarjuna, Priyanka, Shivaji, Shobha Shetty, Yavar-Mo

అతన్ని కావాలనే నామినేట్ చెయ్యలేదని, ప్రియాంక మరియు శోభా శెట్టి ( Priyanka , Shobha Shetty )డామినేషన్ చెయ్యడం వల్ల అశ్వినీ మరియు రతికా నిలబడలేకపోయారని, ఇలా రకరకాలుగా శివాజీ బ్యాచ్ ప్రచారం చేసారు.శివాజీ అయితే అన్యాయం జరుగుతుంది, రాజమాతలకు పగిలిపోతాది అంటూ బూతులు మాట్లాడడం కూడా అందరూ చూసారు.వీళ్ళు ఇచ్చిన సిల్లీ నామినేషన్స్ వింటే ఎవరికైనా నవ్వు రాక తప్పదు.

అమర్ దీప్ మొన్న గేమ్ లో బలంగా ఆడడం వల్ల నా చెయ్యి దెబ్బ తినింది అంటూ సోఫాజి అలియాస్ శివాజీ నామినేషన్ పాయింట్ చెప్తాడు.ఆ ముందు రోజు పొరపాటున తన వల్ల చెయ్యి నొప్పి పెరిగినందుకు అమర్ దీప్ శివాజీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తాడు.

అప్పుడు క్షమించి , నామినేషన్స్ సమయం లో తన బ్యాచ్ లో ఉన్నవాళ్ళని ఎక్కడ నామినేట్ చెయ్యాల్సి వస్తాడో అని అమర్ దీప్ ని ఈ కారణంతో నామినేట్ చెయ్యాలని చూస్తారు.రాజమాతలు అందుకు ఒప్పుకోరు.

Telugu Amardeep, Big Boss, Nagarjuna, Priyanka, Shivaji, Shobha Shetty, Yavar-Mo

మరోపక్క యావర్ ( Yavar )రెండవ వారం లో జరిగిన సంఘటన ని గుర్తుపెట్టుకొని రతికా కోసం అమర్ దీప్ ని నామినేట్ చెయ్యడానికి వస్తాడు.ఈ పాయింట్ ని ఎవరైనా అంగీకరించగలరా?, అందుకే అమర్ దీప్ ని నామినేట్ చెయ్యలేదు.ఇది అడ్డం పెట్టుకొని సోఫాజి అలియాస్ శివాజీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కావాలనే వాళ్ళ మనిషిని సేవ్ చేశారు అంటూ ప్రచారం చెయ్యడం.దానికి ఈరోజు ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కూడా సపోర్టుగా మాట్లాడడం ని చూస్తుంటే, అసలు ఎందుకు ఈ బిగ్ బాస్?, చూసే జనాలు వెర్రివాళ్ళా?, శివాజీ కి కప్ ఇచ్చేసి షో ముగించేస్తే బాగుంటుంది కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సోఫాజి బ్యాచ్ లో కూడా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి.నామినేషన్ వేసుకోవచ్చు కదా ఒకరి మీద ఒకరు?, కానీ అది జరగలేదు.వీళ్ళు ఆడితే మాత్రం గ్రూప్ గేమ్ కాదు, అవతల వ్యక్తులు ఆడితే మాత్రం గ్రూప్ గేమ్.ఇదెక్కడి న్యాయమో జనాలే ఆలోచించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube