పెళ్ళైన మూడు రోజులకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్!

ఎవరు అబ్బా ఆ హీరోయిన్ అని అనుకుంటున్నారా.షార్ట్ ఫిలిం హీరోయిన్ లెండి.

అయిన అందంగా ఉంది.అనుకువగా ఉంది.

ఇంట్లో తల్లితండ్రులకు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదు.దీంతో తన మేనమామకు ఇచ్చి మూడు రోజుల క్రితం పెళ్లి చేశారు.

పెళ్ళైన మూడు రోజులు పుట్టింట్లోనే ఉంది.అత్తింటికి వెళ్లే ముందు రోజే ఆత్మహత్య చేసుకొని మరణించింది.

Advertisement

అసలు ఏమైంది? ఈ ఆత్మహత్య వెనుక అసలు కథ ఏంటి అని పూర్తి వివరాల్లోకి వెళ్తే.తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద సీతానగరానికి చెందిన మహాదాసు శ్రీను, మంగ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు.

ఒకరు డిగ్రీ చదువుతున్న పెద్ద కూతురు రమ్యశ్రీకి మూడు రోజుల క్రితం ఆమె మేనమామతో పెళ్లి చేశారు.అయితే ఆమెకు ఇష్టం లేకుండా కుటుంబ సభ్యులు బలవంతంగా ఆమెకు పెళ్లి జరిపించారు.

దీంతో పెళ్లైన మూడు రోజులకే ఆమె ఇంట్లో ఉన్న ఎలుకల మందు తిని అపస్మారక స్థితికి చేరుకుంది.దీంతో ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

కాళ్లపారాణి ఆరకముందే కన్నకూతురు బలవన్మరణం ఆ తల్లితండ్రులను కుంగతీసింది.దీంతో సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇష్టం అని, ఇటీవల ఓ షార్ట్ ఫిలిం లో హీరోయిన్ గా నటించిందని సమాచారం.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

కాగా ఆ షార్ట్ ఫిలిం ని ఈ నెల 2వ తేదీన విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చెయ్యగా ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

Advertisement

తాజా వార్తలు