లేడీ సింగర్ కు వేధింపులు.. దర్శకుడు అరెస్ట్!

ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో రకాల వేధింపులు ఎదురుకున్నారు.నిజానికి సమాజంలోనే స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది.

 Short Film Director Naveen Kumar Arrested For Molesting Lady Singer, Director Na-TeluguStop.com

కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాదు మహిళలు పని చేసే ప్రతి చోట ఇటువంటి వేధింపులు ఎదురవుతునే ఉన్నాయి.అమ్మాయిలను లొంగ తీసుకోవడం కోసం తమ వ్యక్తిగత విషయాలలో తల దూర్చుతారు కొందరు దుండగులు.

ఎన్ని శిక్షలు విధించిన ఇటువంటి దౌర్జన్యాలు మాత్రం ఆగడం లేదు.ఇదిలా ఉంటే ఓ లేడీ సింగర్ కూడా ఇటువంటి వేధింపులను ఎదుర్కొంది.

సినీ ఇండస్ట్రీలో కెరీర్ కోసం అడుగుపెట్టిన అమ్మాయిల జీవితాలతో ఎంతోమంది ఆడుకుంటారు.తమను కాదనే సరికి అవకాశాలు ఇవ్వకుండా చేస్తారు.ఇండస్ట్రీలో మొదటి నుండి ఇటువంటివి ఎదురవుతూనే ఉన్నాయి.ఇప్పటికీ కూడా ఇలాంటివి ఆగడం లేదు.

ఎంతో మంది నటులు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటారు.ఇక తాజాగా షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్న మహిళను పరిచయం చేసుకొని తనను నానారకాలుగా వేధిస్తున్నాడు.

Telugu Naveen Kumar, Hyderabad, Lady, Tollywood, Youtube Channel-Movie

మోడీ కాయల నవీన్ కుమార్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్.హైదరాబాద్ కు చెందిన ఇతడు 34 ఏళ్లు.ఈయన కొన్ని రోజుల కిందట టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ లేడీ సింగర్ ను ఇంటర్వ్యూ చేసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.ఇక అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత విషయాలను సేకరించుకున్నాడు.

పైగా ఆమె ఫోటోని లోగో గా మార్చి యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేశాడు.అందులో ఆమె పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా మొదలుపెట్టాడు.

Telugu Naveen Kumar, Hyderabad, Lady, Tollywood, Youtube Channel-Movie

అలా షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లను అప్ లోడ్ చేస్తూ ఉండేవాడు.ఇక ఆ సింగర్ వ్యక్తిగత విషయాలను కూడా సేకరించి వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ వైరల్ గా మార్చాడు.ఇక ఆ సింగర్ అలా చేయొద్దు అని ఎంత చెప్పినా వినకుండా అలాగే చేయడంతో ఆమె మానసికంగా కృంగిపోయి.రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్టు చేసి అతనిని విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube