తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో హార్ట్ బ్రేకింగ్ విజువల్స్ కనిపిస్తున్నాయి.ఈ షాకింగ్ వీడియోలోని దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
ఇంతకీ ఈ వీడియోలో ఏం కనిపించిందంటే.ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా అతడిపై ఒక భయంకరమైన పిడుగు నేరుగా వచ్చి పడింది.
దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.ప్రకృతిలో భాగమైన అత్యంత ప్రమాదకరమైన పిడుగు ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నది.
ప్రతి సంవత్సరం వేలాది మంది పిడుగుపాటుకు గురై తనువు చాలిస్తున్నారు.కానీ తాజా పిడుగుపాటులో మాత్రం ఒక మిరాకిల్ జరిగిందనే చెప్పాలి.
ఈ ఘటనలో పిడుగుపాటుకు గురైన వ్యక్తి కేవలం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక కంపెనీలో ఓ 35 ఏళ్ల వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
అతడు పనిచేస్తున్న కంపెనీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వానలు పడుతున్నాయి.అయితే ఇటీవల ఓ వర్షం కురిసిన రోజు సదరు సెక్యూరిటీ గార్డ్ గొడుగు వేసుకొని బయటికి బయలుదేరాడు.
అయితే అప్పుడే మేఘాల్లో నుంచి దూసుకొచ్చిన ఒక పిడుగు అతడి గొడుగు పై పడింది.దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి.ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి.అప్పటికే అతడు ఎవరిని చూడలేక నేలపై పడుకొని చాలా దయనీయమైన పరిస్థితిలో కనిపించాడు.
ఈ విషయాన్ని గమనించిన సహోద్యోగులు వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే చేతులపై స్వల్పంగా కాలిన గాయాలు తప్ప మిగతా ఏ గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.అతను నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు.
ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది.అయితే పిడుగు అతనిపై పడడానికి ముఖ్య కారణం అతని చేతిలో ఒక వాకీ టాకీ ఉండటమేనని ఉద్యోగులు భావిస్తున్నారు.
మేఘాల్లో ఉండే ఎలక్ట్రాన్లు సాధారణంగా భూమిపై ఎత్తుగా ఉండే చెట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై పడుతుంటాయి.అందుకే వర్షం కురుస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో బయటకు వెళ్లకూడదని చెబుతుంటారు.
ఏది ఏమైనా పిడుగుపాటు నుంచి ప్రాణాలతో బయటపడటం నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయమే!